నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ
NEWS Aug 17,2026 11:54 pm
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ఈనెల 18, 19వ తేదీల్లో రెండు రోజులపాటు పలు అంశాలపై ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారులు తెలిపారు.వరంగల్ ములుగు రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ శిక్షణ ఉంటుంది.జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరిన్ని వివరాలకు 7893394393 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.