ప్రభుత్వ వైఖరిపై బీఆర్‌ఎస్ ధర్నా
NEWS Aug 17,2026 02:31 pm
కరీంనగర్: కళ్యాణలక్ష్మి, రైతుబీమా పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ తెలంగాణ చౌక్ వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జీవీ రామకృష్ణారావు, నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.