కిటకిటలాడుతున్న బోగాత జలపాతం
NEWS Aug 16,2026 10:53 pm
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద సందడి వాతావరణం నెలకొంది. జలపాతం అందాలను వీక్షించేందుకు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.ఉదయం నుంచే బొగత వద్ద సందర్శకుల సందడి కనిపించింది. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ యువత, కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు. సాయంత్రం వరకు సందర్శకులతో బొగత జలపాతం కిటకిటలాడింది.