బోయవాడలో వైభవంగా గంగమ్మ బోనాలు
NEWS Aug 16,2026 08:06 pm
కరీంనగర్: నగరంలోని బోయవాడలో బెస్త (గంగపుత్ర) సంఘం ఆధ్వర్యంలో శ్రీ గంగమ్మ తల్లి బోనాల మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేయర్ కొలగాని శ్రీనివాస్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్ తాటి ప్రభావతి, కో-ఆప్షన్ సభ్యులు బల్వీర్ సింగ్, కన్న కృష్ణ, సంఘ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.