'డబ్బు' వేరే వాళ్లకు వెళ్లిపోయిందా?
NEWS Aug 16,2026 05:11 pm
UPI ద్వారా పొరపాటున తప్పు వ్యక్తికి డబ్బు పంపినా పూర్తిగా నష్టపోయినట్లు కాదు. వెంటనే UPI యాప్‌లోని ‘Help’ ఆప్షన్ ద్వారా సంబంధిత లావాదేవీని ఎంచుకుని ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరచుకోవాలి. సైబర్ మోసగాళ్లకు డబ్బు పంపితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి. UTR లేదా ట్రాన్సాక్షన్ ఐడీ, తేదీ, సమయం, మొత్తం, యూపీఐ ఐడీ లేదా మొబైల్ నంబర్, స్క్రీన్‌షాట్లు సిద్ధంగా ఉంచాలి. డబ్బు పంపే ముందు పేరు, UPI ID, మొత్తాన్ని 2సార్లు పరిశీలించి, తొందరపడి చెల్లింపులు చేయకూడదు.