కొత్తకోటలో రోడ్డుపైకి డ్రైనేజీ నీరు
NEWS Aug 16,2026 05:12 pm
రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా డ్రైనేజీ నీరు బీఎన్ రోడ్డుపైకి చేరుతోంది. దీంతో మురుగునీరు నిలిచిపోయి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.