ప్రజల్లోకి సంక్షేమ పథకాలు
NEWS Aug 16,2026 04:38 pm
కరీంనగర్: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పీఏసీ సమీక్ష సమావేశం జరిగింది. తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరై, "SIR" ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, వార్డు స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు వెంటనే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు.