వైభవంగా పిడతలమ్మవారి బోనాల జాతర
NEWS Aug 16,2026 05:25 pm
పాయకరావుపేట: మండలంలోని గజపతినగరం గ్రామంలో శ్రీ పిడతలమ్మవారి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు బోనాలు నెత్తిన పెట్టుకుని మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ సముద్రతీరం వరకు శోభాయాత్ర నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.