పేదల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కృషి
NEWS Aug 16,2026 04:37 pm
ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ములుగు జిల్లా తడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. CM రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మేడారం చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.