ఉత్తమ ఎంపీడీవోగా శివ ప్రసాద్ నారాయణ
NEWS Aug 16,2026 10:30 am
బుచ్చయ్యపేట మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న కె. శివ ప్రసాద్ నారాయణకు అరుదైన గౌరవం దక్కింది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో చూపిన అంకితభావం, సమర్థవంతమైన పనితీరు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో చేసిన కృషిని గుర్తిస్తూ ఆయనను ఉత్తమ ఎంపీడీవోగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.