బెస్ట్ ఎంప్లాయ్‌గా శ్రీకర్‌కు అవార్డు
NEWS Aug 15,2026 05:00 pm
జగిత్యాల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న A.శ్రీకర్‌కు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు లభించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీకర్‌ను ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేసి అవార్డుతో సత్కరించారు. మంత్రి అజారుద్దీన్, జగిత్యాల ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీకర్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగంలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినందుకు ఈ గుర్తింపు దక్కింది.