ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
NEWS Aug 15,2026 05:01 pm
రాయికల్ పట్టణంతో పాటు మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను పుర వైస్ ఛైర్ పర్సన్ తురగ సౌజన్య ఎగురవేశారు. అనంతరం కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. పట్టణంలో పలు పాఠశాలల విద్యార్థులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు, కౌన్సిలర్ రాకేష్ నాయక్, అడ్వకేట్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.