ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
NEWS Aug 15,2026 05:11 pm
కొత్తగూడెం: శ్రీ చైతన్య స్కూల్ కొత్తగూడెం బ్రాంచ్-1లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తిని చాటుతూ నృత్యాలు, కళా ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను అద్భుతంగా ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభ, ఉత్సాహం, దేశభక్తి భావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందించడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.