ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
NEWS Aug 15,2026 05:12 pm
చోడవరం: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించి, దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలను స్మరించారు. దేశభక్తి, ఐక్యతతో దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.