హెడ్ కానిస్టేబుల్ అర్జున్‌కు ఉత్తమ సేవా పురస్కారం
NEWS Aug 15,2026 05:13 pm
బుచ్చయ్యపేట పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్న అర్జున్‌కు ఉత్తమ అధికారి అవార్డు లభించింది. ప్రస్తుతం రోలుగుంట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయనకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత అవార్డు అందజేశారు. కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, జిల్లా ఎస్పీ, కలెక్టర్ పాల్గొన్నారు.