ఏపీలో నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
NEWS Aug 15,2026 02:34 pm
రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో వైయస్సార్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను, అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడిని ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు.వైయస్సార్ కడప జిల్లా మేపల్లె మండలం రాజీవ్‌నగర్ ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్. అమరనాథరెడ్డి, పులివెందుల మండలం అహోబిలపురం ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు సి. వెంకటనాథరెడ్డి, మేపల్లె మండలంలోని భారతి ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఎన్. సంగమేశ్వరరెడ్డిలను డీఈవో షంషుద్దీన్ సస్పెండ్ చేశారు.