స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు పిలుపు
NEWS Aug 15,2026 02:31 pm
మన చేతిలో జాతీయ జెండా ఉండాలి.. మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్యమంత్రి హాజరై జాతీయజెండాను ఎగుర వేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా స్వాతంత్ర్య వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్‌తో పాటు బుల్లెట్ ఎస్కార్టు వచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.