సామాజిక న్యాయమే నిజమైన స్వాతంత్య్రం: తెలంగాణ రక్షణ సేన
NEWS Aug 15,2026 05:16 pm
కరీంనగర్: అణగారిన వర్గాలకు సమాన హక్కులు దక్కినప్పుడే నిజమైన స్వాతంత్య్రం లభిస్తుందని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.