పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మేయర్ శ్రీనివాస్
NEWS Aug 15,2026 05:14 pm
కరీంనగర్ కార్పొరేషన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం హౌసింగ్ బోర్డ్ కాలనీ మినీ ఇండోర్ స్టేడియం ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన పాల్గొని 200 మొక్కలు నాటారు. పచ్చదనంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.