విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ
NEWS Aug 15,2026 01:16 pm
బుచ్చయ్యపేట: పొట్టిదోరపాలెం కొత్తూరు ఎంపీపీ పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వడ్డీ సత్యారావు ఆర్థిక సహకారంతో విద్యార్థులకు జాతీయ జెండాలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేల్స్, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం వారి సంతోషం, ఉత్సాహం మధ్య ఘనంగా సాగింది.