డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఈగల్ టీం
NEWS Aug 18,2026 08:42 pm
కరీంనగర్ : మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నిపుణులు పిలుపునిచ్చారు. స్థానిక కిమ్స్ కళాశాలలో శుక్రవారం ఈగల్ టీం, మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.