ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్
NEWS Aug 14,2026 11:50 pm
కరీంనగర్ నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆయన స్థానిక ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి నాణ్యతలో రాజీ పడొద్దని, పైప్‌లైన్ లీకేజీలు, సాంకేతిక లోపాలను తక్షణమే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.