ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
NEWS Aug 14,2026 10:03 am
కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు 125 రోజుల ఉచిత శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ డా. రవికుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన డిగ్రీ అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులు tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 0878-2268686 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.