మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్?
NEWS Aug 12,2026 05:14 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైనట్లు సమాచారం. అయితే రేగా కాంతారావు అరెస్ట్‌పై అధికారికంగా పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.