కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3 కౌన్సిల్ సమావేశాలతో పాటు ప్రత్యేక బడ్జెట్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టించకుండా నగరాభివృద్ధికి సహకరించాలని మాజీ మేయర్‌కు సూచించారు. అధికారిక రికార్డుల ఆధారంగా మాట్లాడాలని కోరారు.