ప్రతి ఇంటి నంబర్‌ను జియోట్యాగ్ చేయాలి
NEWS Aug 12,2026 10:28 pm
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. సర్కిళ్ల వారీగా ఆస్తి పన్నుల వసూళ్లు, కొత్త నిర్మాణాల గుర్తింపు, ప్రభుత్వ భవనాల రీ-అసెస్‌మెంట్, వాణిజ్య, వాణిజ్యేతర భవనాలకు పన్నుల విధింపుపై సమీక్షించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.