ఇటిక్యాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి
NEWS Aug 12,2026 10:28 pm
ఇటిక్యాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా మునగాల గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ. సంపత్ కుమార్, ఇటిక్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రుక్మానంద రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని సర్పంచులందరూ సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండాలని సూచించారు. గ్రామాల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.