గుడివాడ వన్ టౌన్ ఎస్ ఐ పై వేటు
NEWS Aug 12,2026 03:37 pm
కూటమి ప్రభుత్వంలో కొంతమంది పోలీస్ అధికారుల తీరు విమర్శల పాలవుతోంది. తాజాగా గుడివాడలో వన్ టౌన్ ఎస్ ఐ సత్యనారాయణ వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో కృష్ణా జిల్లా గుడివాడ ఒకటో పట్టణ ఎస్.ఐ.సత్యనారాయణని బదిలీ చేశారు. సత్యనారాయణని వీఆర్ కు పంపిస్తూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీచేశారు. ఈమధ్య డీఎస్సీ నియామకాలకు వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ సందర్భంగా కొడాలి నానితో ఎస్.ఐ వ్యవహరించిన తీరుపై విమర్శలు చెలరేగాయి. ఈనెల 10న గుడివాడ పట్టణంలో వైసీపీ నిర్వహించిన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ నోటీసును మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్‌ఐ సత్యనారాయణ అందించారు. అయినా.. కొడాలి నాని పోలీసుల ఆదేశాలు ధిక్కరించి వైసీపీ శిబిరం వద్దకు వెళ్లారు. ఈక్రమంలో జరిగిన పరిమాణాల్లో కొడాలి నానితో ఎస్‌ఐ చనువుగా మెలిగారని విమర్శలు వచ్చాయి. విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించకుండా చూసీ చూడనట్టు వ్యవహరించారనే ఆరోపణలతో వీఆర్ కి పంపించారు ఉన్నతాధికారులు.