త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్‌లు
NEWS Aug 11,2026 09:55 pm
దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నాయి. ₹10, ₹20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో డినామినేషన్‌లో వంద కోట్ల చొప్పున నోట్లను ప్రయోగాత్మకంగా జారీచేసే ప్రతిపాదనను ఆమోదించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుత కాగితపు నోట్ల స్థానంలో వీటిని తీసుకురావడం లేదని, వాటితో పాటే ఈ కొత్త నోట్లు కూడా అందుబాటులో ఉంటాయని, పాలిమర్ నోట్ల సేకరణ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉందని RBI చెప్పింది.