భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు
NEWS Aug 11,2026 11:11 am
ఇటీవల పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు ఊహించని షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో (ఆగస్టు 11, 2026) 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఒక్కరోజే ఏకంగా రూ.3,160 పెరిగి రూ.1,55,130 మార్కుకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,900 మేర పెరిగి రూ.1,42,200గా పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.10,000 మేర భారీగా పెరిగి రూ.2,60,000 మార్కును తాకింది.