పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి
NEWS Aug 11,2026 11:06 am
హైదరాబాద్ ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో పుణ్యం తగ్గి, పాపం ఎక్కువైపోతోందని తప్పులు సరిదిద్దుకోకపోతే, పాపాలు ఎక్కువై కుండపోత వర్షాలు వచ్చి కొట్టుకుపోయే ప్రమాదం ఉంద, సమాజంలో ఆచార వ్యవహారాలను వీడితే తీవ్ర అనర్థాలు తప్పవని మాతంగి అనురాధ హెచ్చరించారు.