ఎంపీ అరవింద్ సహకారంతో ALIMCO శిబిరం
NEWS Aug 11,2026 10:25 am
కోరుట్ల: ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో వికలాంగుల కోసం ఆగస్టు 13న కోరుట్లలో ALIMCO ఆధ్వర్యంలో సహాయక శిబిరం నిర్వహించనున్నారు. CMS గార్డెన్, ఐలాపూర్ రోడ్డులో శిబిరం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అర్హులకు వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వాకర్లు, క్రచెస్, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలు తదితర సహాయక ఉపకరణాలు అందించేందుకు గుర్తింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు ఆధార్ కార్డు, వికలాంగుల ధ్రువీకరణ పత్రం, ఫొటోతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.