బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
NEWS Aug 07,2026 07:50 pm
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బీసీ సంరక్షణ చట్టం ముసాయిదా సిద్ధమైందని తెలిపారు. అలాగే ‘నేతన్న సేవలో’ పథకం కింద 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.