తెల్లరేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం
NEWS Aug 06,2026 02:02 pm
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త రేషన్‌కార్డులు ఇస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రేషన్‌కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజున మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒకే సారి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని చెప్పారు.