లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన జీపీఓ
NEWS Aug 06,2026 01:49 pm
మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు బాధితుడు మల్లేష్ వద్ద రూ.5 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, రూ.5 వేల లంచం స్వీకరిస్తుండగా రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.