మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
NEWS Aug 05,2026 09:43 pm
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, డీప్‌ఫేక్‌ల వ్యాప్తి, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన తప్పిదాలపై మెటా విచారం వ్యక్తం చేసింది. కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్ చేసేందుకు భారీగా డబ్బులు తీసుకున్నట్లు మెటా బృందం అంగీకరించిందని కొన్ని వర్గాలు తెలిపినట్లు పీటీఐ కథనం పేర్కొంది. ఈ వ్యవహారంపై మెటా సారీ చెప్పడంతో పాటు తమ ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లను కూడా మెటా అంగీకరించినట్లు తెలుస్తోంది.