బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం
NEWS Aug 05,2026 12:58 pm
తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి ఎన్. మరియా విల్సన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య శాఖకు రూ.23,353 కోట్లు, మహిళల సంక్షేమ పథకాలకు రూ.1,372 కోట్లు, విద్యార్థుల ల్యాప్‌టాప్‌లకు రూ.2,000 కోట్లు కేటాయించింది. అలాగే 10 ఒలింపిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, కామరాజర్ అల్పాహార పథకం, మదురైలో ప్రభుత్వ లా కాలేజీ ఏర్పాటును ప్రకటించింది. మహిళలు, విద్య, ఆరోగ్యం, క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ తొలి బడ్జెట్‌ను రూపొందించింది.