మెట్‌పల్లిలో తెగిన పెద్ద చెరువును ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు సర్కస్‌లా ఉందని విమర్శించారు. పురపాలక, ఇరిగేషన్ శాఖల అధికారుల సమన్వయ లోపంతో తాగునీటి సమస్య తలెత్తడంతో పాటు మత్స్యకారులకు నష్టం జరిగిందన్నారు. ఇరిగేషన్ శాఖ ఎన్‌ఓసీ లేకుండానే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. చెరువు కట్టను వెంటనే పటిష్టం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇరు శాఖల అధికారులను ఆదేశించారు.