బిగ్‌బాస్ 10కు ముహూర్తం ఫిక్స్
NEWS Aug 04,2026 01:04 pm
బిగ్ బాస్ తెలుగు 10 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్ థీమ్‌ను ‘అగ్నిపరీక్ష’గా ప్రకటించింది. గత సీజన్ల కంటే కఠినమైన టాస్కులు, అనూహ్య ట్విస్టులతో షోను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా నాగార్జున హోస్ట్. స్టార్ మా ఛానెల్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. కంటెస్టెంట్ల అధికారిక జాబితాను గ్రాండ్ లాంచ్ రోజున ప్రకటిస్తారు.