ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
NEWS Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్‌కసిరెడ్డి, కారుమూరి సునీల్ లకు ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది.