అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు
NEWS Aug 03,2026 12:56 pm
ఏపీ రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్‌లో విద్యుత్ లైన్ల మళ్లింపు, రీ-రూటింగ్ పనులను విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్ తీగలు బయటకు కనపడని విధంగా రాజధానిని తీర్చిదిద్దుతున్నారు. 400 కేవీ విద్యుత్ లైన్లను మళ్లించడంతో పాటు కొత్తగా రెండు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.1,979.10 కోట్లతో 18 పనులు చేపట్టారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు 400 కేవీ, 220 కేవీ విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి.