ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసులో ట్విస్ట్
NEWS Aug 03,2026 12:51 pm
కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కొత్త ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ సందర్భంగా తన తోటి మహిళా ఐపీఎస్ అధికారితో పాటు మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలుండేవని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు పెట్టారు.