తమిళ సీఎం విజయ్ పై కొడుకు ప్రశంసలు
NEWS Aug 03,2026 12:45 pm
తన తండ్రి సీఎం కావడం ఓ విప్లవమంటూ తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే, కుటుంబంపై బాధ్యత మరింత పెరిగిందన్నాడు. సందీప్ కిషన్ కథానాయకుడిగా సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’ సినిమా త్వరలో విడుదల కానుంది. తన తండ్రి రాజకీయ ప్రయాణం, ఇంట్లో ఉన్న వాతావరణం గురించి పలు విషయాలను పంచుకున్నారు.