భారత్ బాక్సర్లు పతకాల పంట!
NEWS Aug 01,2026 10:23 pm
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్(ఇంగ్లాండ్)ను సాక్షి 5-0 తేడాతో మట్టికరిపించి విజేతగా నిలిచింది. మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా గోల్డ్ పతకం సాధించింది. ఫైనల్‌లో కెనడాకు చెందిన మేరీ అల్-అహ్మదీహ్ 4-1తో తేడాతో ఓడించి స్వర్ణం ఎగరేసుకుపోయింది. మహిళల 70 కేజీల విభాగం ఫైనల్‌లో అరుంధతి చౌదరి స్వర్ణం గెల్చుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన చాంటెల్ రీడ్‌పై అరుంధతి 5-0 తేడాతో గెలిచింది. దీంతో బాక్సింగ్‌లో భారత పతకాల సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా పసిడి పతకాలు దక్కించుకున్నారు.