ప్రధాని మోడీ భోగాపురం టూర్ ఖర్చెంతో తెలుసా?
NEWS Aug 01,2026 12:27 pm
ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభించారు. మోడీ విజయనగరం పర్యటన కోసం సాధారణ పరిపాలన శాఖకు రూ.5 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం, బహిరంగ సభ ఏర్పాట్ల అత్యవసర వ్యయాల కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు జీవోలో పేర్కొన్నారు.