తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
NEWS Aug 01,2026 11:51 am
19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను గ్యాస్ కంపెనీలు రూ.200కుపైగా తగ్గించాయి. గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ సిలిండర్ ధర 995 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ.202, కోల్‌కతాలో రూ.209 వరకు తగ్గింది.