ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
NEWS Jul 31,2026 05:25 pm
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్, విచారణ కమిటీల నివేదిక ఆధారంగా ప్రసాద్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎంతో ఘనమయిన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయ ఉన్నత విద్యా ప్రమాణాలను ఆయన రాజకీయం చేశారు. వర్శిటీ దశాబ్దాల కీర్తిప్రతిష్టలను దిగజార్చేలా ఆయన సాగించిన వైఖరిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమగ్ర విచారణ జరిపింది.