కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
NEWS Jul 31,2026 02:19 pm
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి మట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను సమీక్షించారు. దిగువ గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని, గేట్లు, ప్రమాదకర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖానాపూర్‌లో వర్షాలకు దెబ్బతిన్న రహదారిని పరిశీలించి, వసతి గృహ విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవసరమైన సరఫరాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.