భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
NEWS Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద నీటిలో ఉన్నాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.