వందేమాతరం బిల్లుకు పార్లమెంటు ఆమోదం
NEWS Jul 30,2026 05:56 pm
వందేమాతరం గేయాన్ని అవమానించడం నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు లోక్‌సభ కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఇది చట్ట రూపం దాల్చనుంది. ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ నేడు మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది.జాతీయ గేయాన్ని అవమానించడం నేరంగా పరిగణించేలా నేషనల్ ఆనర్ యాక్ట్-1971 చట్టంలో మార్పుల కోసం కేంద్రం తాజా బిల్లును తీసుకొచ్చింది.